హైదరాబాద్ ప్రపంచంలో వ్యాపారాలకు, టెక్ కంపెనీలకు కొత్త డెస్టినేషన్ గా మారిపోయింది. దీంతో అనేక గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు ప్రస్తుతం తమ కార్యాలయాలను భాగ్యనగరానికి మార్చేస్తున్నాయి. టాలెంటెడ్ యూత్, సపోర్టింగ్ గవర్నమెంట్, వ్యాపార అనుకూలమైన వాతావరణం, ప్రోత్సాహకాలు దీనికి కారణంగా మారాయి.
తాజాగా అమెరికా స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారతదేశంలో ముంబై తర్వాత తన రెండవ ఆఫీసు కోసం హైదరాబాదును ఎంచుకుంది. హైటెక్ సిటీలో 40వేల చదరపు అడుగుల ఆఫీస్ ఏర్పాటుకు నిర్ణయించింది. ప్రపంచ కార్యకలాపాలకు ఈ ఆఫీసు బ్యాక్ బోన్ మాదిరిగా ఉండబోతుందని తెలుస్తోంది. నగరంలోని బలమైన టెక్ ఇన్ ఫ్రా, టాలెంటెడ్ యువత ఈ నిర్ణయానికి కారణంగా చెబుతోంది స్ట్రీమింగ్ కంపెనీ. నెట్ ఫ్లిక్స్ రాకతో వందల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
కంపెనీ ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రం నుంచి పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ ఆపరేషన్స్ ఇక్కడి నుంచి నిర్వహించనుందని తెలుస్తోంది. అలాగే ఈ కేంద్రం ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్ టెక్ ద్వారా ఎడిటింగ్, యానిమేషన్, రెండరింగ్ సేవలను చూసుకుంటుందని సమాచారం. ఇందుకోసం హైటెక్ సిటీ ఆఫీసులో ప్రపంచ స్థాయి విఎఫ్ఎక్స్ స్టూడియోల ఏర్పాటు జరగబోతున్నట్లు వెల్లడైంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ రాక హైదరాబాద్ టెక్ కేంద్రంగా మారుతున్న వేగాన్ని మరింత పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
రానున్న కాలంలో హైదరాబాద్ గేమింగ్, యానిమేషన్, పోస్ట్ ప్రొడక్షన్ రంగాలకు సెంటర్ అవ్వనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే అనేక సంస్థలు ఇక్కడి నుంచి పనిచేస్తుండగా.. ప్రపంచ స్థాయి యానిమేషన్ కంపెనీలు ఏఐ టెక్నాలజీలను ఇక్కడికి తీసుకొస్తాయని అందరూ నమ్ముతున్నారు. ఈ కొత్త వార్తతో హైదరాబాదులోని వీఎఫ్ఎక్స్ ట్రైనింగ్ సంస్థల్లో కూడా ఉత్సాహం కనిపిస్తోంది.
మెుత్తానికి నెట్ ఫ్లిక్స్ తన హైదరాబాద్ ఆఫీసులో పోస్ట్ ప్రొడక్షన్, సౌండ్ ఫ్రూఫ్ ఎడిటింగ్ సూట్స్, హై స్పీడ్ డేటా సర్వర్ల ఏర్పాటు చేయనుందని తెలిస్తోంది. గ్లోబల్ ప్రాజెక్టుల్లో పనిచేయాలనుకుంటున్న టాలెంట్ కోసం మనకు దగ్గరలోనే అవకాశాలు రాబోతున్నాయని తెలుగు యువత ఉత్సాహంగా ఉంది.
