ఆస్ట్రేలియతో జరగనున్న నాలుగో టీ20కి టీమిండియా సిద్ధమవుతోంది. 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా గురువారం (నవంబర్ 6) జరగనున్న నాలుగో టీ20కి క్వీన్స్‌ల్యాండ్ లో కర్రారా ఓవల్ స్టేడియం ఆతిధ్యమివ్వనుంది. ఇప్పటికే సిరీస్ లో మూడు టీ20 మ్యాచ్ లు జరిగితే 1-1తో సమంగా నిలిచాయి. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. సిరీస్ గెలవాలంటే ఇరు జట్లు చివరి రెండు మ్యాచ్ ల్లో గెలవాలి. నాలుగో టీ20లో గెలిచిన జట్టుకు సిరీస్ ఓడిపోయే ఛాన్స్ ఉండదు. దీంతో రెండు జట్లు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
అభిషేక్ శర్మతో పాటు సంజు శాంసన్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గిల్ మూడు ఫార్మాట్ లు ఆడుతూ ఇప్పటికే బాగా అలిసి పోయాడు. నవంబర్ 14 నుంచి సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. దీంతో చివరి రెండు టీ20 లకు గిల్ కు రెస్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడో స్థానంలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడతాడు. గత కొంతకాలంగా సూర్య విఫలమవుతున్నా.. ఒక్కసారి ఫామ్ లోకి వస్తే ఎంత ప్రమాదకరమో అందరికీ తెలుసు. నాలుగో స్థానంలో తిలక్ బ్యాటింగ్ కు వస్తాడు. ఐదో ప్లేస్‌లో వికెట్ కీపర్ కమ్ ఫినిషర్‌గా జితేష్ శర్మ ఆడతాడు.
ఆరో స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ శివమ్ దూబే బ్యాటింగ్ కు వచ్చే అవకాశాలున్నాయి. ఏడో స్థానంలో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ స్థానానికి ఎలాంటి ఢోకా లేదు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్వదేశానికి రావడంతో స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్ టన్ సుందర్ కొనసాగుతాడు. యార్కర్ల వీరుడు జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అర్షదీప్ సింగ్ తో పాటు హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ 11 లో ఆడనున్నారు. ఒకవేళ గిల్, బుమ్రాలకు రెస్ట్ అవసరం లేదని భావిస్తే నాలుగో టీ20లో ఆడిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగనుంది.
ఇండియా ప్లేయింగ్ 11 (అంచనా):
అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్, జితేష్ శర్మ, శివమ్ దూబే, వాషింగ్ టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా, అర్షదీప్ సింగ్
