వరదలు లేని హైదరాబాద్ హైడ్రాతోనే సాధ్యం.. హైడ్రాకు మద్దతుగా నగర వాసుల ర్యాలీ

 వరదలు లేని  హైదరాబాద్ హైడ్రాతోనే సాధ్యం.. హైడ్రాకు మద్దతుగా నగర వాసుల ర్యాలీ

హైడ్రా పై దుష్ప్రచారాన్ని హైదరాబాద్ ప్రజలు తిప్పి కొడుతున్నారు. హైడ్రాపై తప్పుడు వార్తలకు వ్యతిరేకంగా ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా చేసిన పనులపై  నగరంలోని పలు చోట్లు  ప్రశంసలు కురిపిస్తున్నారు. హైడ్రాకు మద్దతుగా ప్లకార్టులు పట్టుకుని హైడ్రా జిందాబాద్..వరదలు లేని నగరం హైడ్రాతోనే సాధ్యమంటూ నినాదాలు చేస్తున్నారు నగర వాసులు. హైడ్రాపై దుష్ప్రచారం తగదని.. హైడ్రా ప్రజల కోసం పనిచేస్తోందంటూ హెచ్చరిస్తున్నారు ప్రజలు.

అంబర్‌ పేట్ బతుకమ్మకుంటలో హైడ్రాకు మద్దతుగా వాకర్స్  ర్యాలీ నిర్వహించారు.  మణికొండలో 15 కాలనీల ప్రజల భారీ ర్యాలీ నిర్వహించారు.  వెయ్యి కోట్ల విలువైన పార్కులను కాపాడిన హైడ్రాకు మద్దతుగా ఖాజాగూడ ప్రశాంతి హిల్స్‌లో స్థానికులు మొక్కలు నాటారు.  కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో 2000 గజాల పార్కును కాపాడిందని హైడ్రాకు అభినందనలు తెలిపారు.  ఉస్మానియా ప్రొఫెసర్స్ కాలనీలో ప్రజావసర భూముల రక్షణకు కృతజ్ఞతలు తెలిపారు స్థానికులు. హైడ్రా జిందాబాద్” అంటూ నినాదాలు చేస్తూ  ప్లకార్డులు ప్రదర్శించారు.  

హైడ్రా లేకపోతే పార్కులు, చెరువులు కాపాడలేం” అంటూ ప్రజలు చెబుతున్నారు. నిరంతర వర్షాల మధ్య వరద ఉదృతిని తగ్గించేందుకు  హైడ్రా కృషి చేసిందంటున్నారు.  పూడికతీత పనుల వలన నాలాలు సాఫీగా ప్రవహించాయని హైడ్రాను అభినందిస్తున్నారు.  పార్కులు, చెరువులు కాపాడిన హైడ్రా ఆరోగ్య రక్షకురాలుగా నిలిచిందని ప్రజలు ప్రశంసిస్తున్నారు. హఫీజ్ బాబా నగర్‌లో హైడ్రా కూల్చివేతలు జరపలేదని ప్రజల స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ  కూల్చిన స్కూల్ భవనాన్ని హైడ్రాకు ఆపాదించడం సరికాదన్నారు.  హైడ్రా రాజకీయాలకు అతీతం .. ప్రజల కోసం మాత్రమే పనిచేస్తుందన్నారు.  దశాబ్దాల సమస్యలను గంటల్లో పరిష్కరిస్తోన్న  హైడ్రాకు  ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.  కబ్జాదారుల విధ్వంసం ఆగాలంటే హైడ్రా అవసరమని చెబుతున్నారు నగర వాసులు.