హైదరాబాద్ శివరాంపల్లిలో డ్రగ్స్ ఓవర్ డోస్ అయ్యి.. యువకుడు మృతి

హైదరాబాద్ శివరాంపల్లిలో డ్రగ్స్ ఓవర్ డోస్ అయ్యి.. యువకుడు మృతి

హైదరాబాద్ లో డ్రగ్స్ కల్చర్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఈగల్ టీం ఏర్పాటు చేసి డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నప్పటికీ డ్రగ్స్ కల్చర్ అంతం అవ్వటంలేదు. పోలీసులు నిర్వహించే తనిఖీల్లో తరచూ ఎక్కడో ఒక చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. హైదరాబాద్ శివరాంపల్లిలో దారుణం జరిగింది.. డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకొని ఓ యువకుడు మృతి చెందాడు. గురువారం ( నవంబర్ 6 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..  

శివరాంపల్లి కెన్వర్త్ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ నంబర్ 805లో అహ్మద్ అలీ, అతని స్నేహితుడు మరో ఇద్దరు యువతులతో కలిసి లివింగ్ రిలేషన్  షిప్ లో ఉంటున్నారు. బుధవారం  ( నవంబర్ 5 ) రాత్రి అహ్మది అలీ, అతని స్నేహితుడు ఇద్దరు యువతులతో కలిసి డ్రగ్స్ పార్టీ చేసుకున్నారు. పార్టీ తర్వాత అహ్మద్ అలీ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అహ్మద్ అలీ అప్పటికే మరణించినట్లు నిర్దారించారు. డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకోవడం వల్లే అహ్మద్ అలీ మృతి చెందినట్లు భావిస్తున్నామని అంటున్నారు పోలీసులు. ఈ ఘటనపై అనుమాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.