అమీన్పూర్ లో ఘనంగా అయ్యప్ప మహాపడి పూజ

అమీన్పూర్ లో ఘనంగా అయ్యప్ప మహాపడి పూజ

అమీన్​పూర్​, వెలుగు : అమీన్​పూర్​ మున్సిపల్​ పట్టణ కేంద్రంలో అయ్యప్ప మహాపడి పూజ బుధవారం కన్నుల పండువగా జరిగింది. మున్సిపల్​ మాజీ చైర్మన్​ తుమ్మల పాండురంగారెడ్డి కొడుకు రుశ్వంత్​ రెడ్డి కన్నెస్వామి ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని అయ్యప్ప పడిపూజ నిర్వహించారు. 

చుట్టు పక్కల అయ్యప్ప స్వాములు, అయ్యప్ప భక్తులు   భారీ సంఖ్యలో పడిపూజకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి అభిషేకాలు, అలంకరణలు, పుష్పాభిషేకాలు నిర్వహించారు. అయ్యప్ప భక్తి పాటలు అందరిని అలరించాయి.