కొండగట్టు, వెలుగు: కొండగట్టులో గిరి ప్రదక్షిణ బుధవారం అంగరంగా వైభవంగా జరిగింది. ఎన్నడూ లేని విధంగా సుమారు 7 వేల మంది భక్తులు పాల్గొన్నారు. కార్తీక పూర్ణమి, గురునానక్ జయంతి సందర్భంగా హాలీడే కావడంతో భక్తులు భారీగా తరలివచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.
గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. గిరి ప్రదక్షణ రూపకర్త సురేశ్ ఆత్మరామ్ మహారాజ్, శ్రీనివాసుల సేవా సంస్థ అధ్యక్షుడు వూట్కూరి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
