పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తాం : ఎమ్మెల్యే సంజయ్ కుమార్

 పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తాం : ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల రూరల్, వెలుగు: పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని క్యాంప్ ఆఫీసులో నియోజవర్గానికి చెందిన నలుగురు లబ్ధిదారులకు రూ10.25 లక్షల ఎల్‌‌‌‌వోసీ ప్రొసీడింగ్స్ లెటర్లను ఎమ్మెల్యే అందజేశారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అభివృద్ధి పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌, దామోదర రాజనర్సింహను ఆహ్వానించి భూమిపూజ చేస్తామన్నారు. 2023లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు విషయమై సీఎంను కలిసి మాట్లాడడంతో పాత బకాయిలు విడుదల చేశారన్నారు. కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున్, సయ్యద్ గౌస్, మల్లేశ్‌‌‌‌, రవి, సత్తిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.