కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఘనంగా శ్రీపాదరావు జయంతి 

 కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఘనంగా శ్రీపాదరావు జయంతి 

కరీంనగర్ సిటీ, వెలుగు:  కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏపీ మాజీ స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దుద్దిళ్ల శ్రీపాద రావు జయంతిని కాంగ్రెస్ లీడర్లు ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శ్రీపాదరావు ఫొటోకు నివాళులర్పించారు. బస్టాండ్ కూడలి వద్ద శ్రీపాద రావు విగ్రహనికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎండీ తాజ్, కొరివి అరుణ్ కుమార్, కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్, పర్వత మల్లేశం, వరాల నర్సింగం, గుమ్మడి రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

జగిత్యాల టౌన్, వెలుగు: మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దివంగత స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫొటోకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీపాద రావు  ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి నిష్పక్షపాతంగా వ్యవహరించిన గొప్ప ప్రజానాయకుడని కొనియాడారు. అనంతరం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజావాణి అర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన కొడిమ్యాల రాజయ్య అనే వృద్ధుడు తన కొడుకులు పట్టించుకోవడం లేదని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేశాడు.