Rashmika: 'మగాళ్లకు పీరియడ్స్ వస్తే ఆ బాధ తెలుస్తుంది'.. రష్మిక సంచలన వ్యాఖ్యలు వైరల్!

Rashmika: 'మగాళ్లకు పీరియడ్స్ వస్తే ఆ బాధ తెలుస్తుంది'.. రష్మిక సంచలన వ్యాఖ్యలు వైరల్!

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉంది. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ తన సత్తాను చాటుతోంది.  ఇప్పటికే ఛావా, సికిందర్, కుబేరా, థామా వంటి బ్లాక్‌బస్టర్ విజయాలతో దూసుకుపోతోంది.   ఇప్పుడు అందాల తార తన ఐదో సినిమా 'ది గర్ల్‌ఫ్రెండ్‌' (The Girlfriend) తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ డ్రామా నవంబర్ 7న గ్రాండ్‌గా విడుదల కానుంది. 

ప్రమోషన్స్‌లో రష్మిక జోరు..

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రష్మిక బాగానే కష్టపడుతోంది. ఇప్పటికే ఆమె తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్ వేదికపై సందడి చేసింది. లేటెస్ట్ గా ప్రముఖ  నటుడు జగపతి బాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా'  టాక్ షో లో రష్మిక పాల్గొంది. ఈ షోలో సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలపై కూడా ఓపెన్‌గా మాట్లాడింది.

మగాళ్లకు పీరియడ్స్ వస్తే.. 

ఈ టాక్ షోలో జగపతి బాబు అడిగిన ఓ ప్రశ్నకు రష్మిక ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 'మగాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే బాగుండని  ఫీలైనట్లున్నావ్?' అని జగపతి బాబు ప్రశ్నించారు. అందుకు రష్మిక ఏ మాత్రం ఆలోచించకుండా అవును అని బదులిచ్చింది.  'మగాళ్లకు కనీసం ఒక్కసారైనా పీరియడ్స్ వస్తే, ఆ బాధ ఎలా ఉంటుందో, ఆ సమయంలో మహిళలు ఎదుర్కొనే అసౌకర్యం ఏంటో వారికి అర్థం అవుతుంది. ఈ నొప్పిని వాళ్ళు అనుభవిస్తేనే, మా భావాలను గౌరవిస్తారు' అని చెప్పుకొచ్చింది.

ఆమె ఇచ్చిన ఈ బోల్డ్, ఎమోషనల్ సమాధానానికి షోలో ఉన్న ప్రేక్షకులు, జగపతి బాబు సైతం చప్పట్లతో ఆమెను అభినందించారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రష్మిక మాట్లాడిన ఈ విషయంపై నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తూ, మహిళల పట్ల ఆమెకున్న సానుభూతిని కొనియాడుతున్నారు. 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీలో  దీక్షిత్ శెట్టి సరసన రష్మిక నటించింది. ఈ మూవీలో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రలో యాక్ట్ చేసింది.  మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డును సృష్టిస్తుందో చూడాలి.