న్యూఢిల్లీ: సోలార్ పీవీ మాడ్యూల్స్, సెల్స్ తయారు చేసే ఎమ్వీ ఫొటోవొల్టాయిక్ పవర్ లిమిటెడ్ ఐపీఓ ఈ నెల 11–13 తేదీల్లో ఉంటుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం నవంబర్ 10న ఓపెన్‌లో ఉంటుంది. ఈ ఐపీఓ ద్వారా రూ.2,900 కోట్లు సేకరించాలని కంపెనీ చూస్తోంది.
ఐపీఓలో రూ.2,143.86 కోట్ల విలువైన తాజా షేర్ల జారీ ఉండగా, ఇందులో రూ.1,621 కోట్లను అప్పులు తీర్చడానికి, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వాడతామని కంపెనీ ప్రకటించింది. మరోవైపు ఎడ్‌టెక్ కంపెనీ ఫిజిక్స్ వాలా ఐపీఓ కూడా ఈ నెల 11న ఓపెనై, 13న ముగుస్తుంది.
