బీఆర్ఎస్ కారు ఇప్పటికే పంచరయ్యింది..బీజేపీ పువ్వు వాడిపోయిందన్నారు మంత్రి అజారుద్దీన్ .షేక్ పేటలో రేవంత్ రోడ్ షోలో పాల్గొన్న ఆయన..సీఎం 12 మంది మైనార్టీలకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇచ్చారని చెప్పారు. ఎంఐఎం కాంగ్రెస్ దోస్తాన్ ఇప్పటిదికాదన్నారు. నవీన్ యాదవ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ 100 శాతం స్టైక్ రేట్తో గెలు స్తుందని మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్ ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ లో ఇతర పార్టీలు కనిపించడం లేదని, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 6 నెలల మంత్రి అని విమర్శించే వారి మాటలకు తాను స్పందించాల్సిన అవసరం లేదన్నారు. తానేమిటో ఇంటర్నెట్ లో కొడితే తెలుస్తుందన్నారు. దేశం కోసం తాను ఏమి చేశానో అందరికీ తెలుసన్నారు . పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పిన మంత్రి పదేండ్ల బీఆర్ ఎస్ పాలనలో ముస్లిం విద్యార్థులకు స్కాలర్ షిప్స్ రాలేవన్నారు.
