మక్తల్, వెలుగు: ఎగువన కురిసిన వర్షాలతో సంగంబండ రిజర్వాయర్‌కు భారీగా వరద వస్తోంది. దీంతో బుధవారం ప్రాజెక్టు ఒక గేటును ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మంగళవారం కర్నాటకలో కురిసిన వర్షాలతో పెద్దవాగుకు భారీగా వరద వస్తుండడంతో ఒక స్పిల్ వే గేటు ఎత్తి 500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు డీఈ సురేశ్, ఏఈ రాహుల్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 3.317 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2.78 టీఎంసీలు ఉన్నట్లు చెప్పారు.
