ఈ నెల 10 వరకు సెక్రటేరియెట్​లోకి నో ఎంట్రీ

ఈ నెల 10 వరకు సెక్రటేరియెట్​లోకి నో ఎంట్రీ

 

  • ఈ నెల 10 వరకు సెక్రటేరియెట్​లోకి నో ఎంట్రీ
  • విజిటర్స్​కు పాస్​లు నిలిపివేయాలని పోలీసులకు ఉన్నతాధికారుల ఆర్డర్స్​

హైదరాబాద్, వెలుగు: కొత్త సెక్రటేరియెట్‌‌కు ఈ నెల 10 వరకు విజిటర్స్​కు అనుమతి నిలిపివేశారు. ఈ మేరకు సెక్రటేరియెట్‌‌ గేట్‌‌ దగ్గర డ్యూటీలు చేస్తున్న పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అప్పటి వరకు పాస్​లు జారీ చేయొద్దని సూచించారు. దీంతో వివిధ వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెక్రటేరియెట్‌‌కు విజిటింగ్ టైమ్ ఉంటుంది. ఆ సమయంలో జిల్లాల నుంచి మంత్రులను, సీఎంఆర్‌‌‌‌ఎఫ్, ఇతర అధికారులను కలిసేందుకు విజిటర్స్‌‌ వస్తుంటారు.

వచ్చిన వారందరికీ పాస్‌‌లు ఇవ్వడం లేదు. రాబోయే రోజుల్లో కూడా విజిటర్స్‌‌ పాస్‌‌లను తగ్గించే అవకాశం ఉందని పలువురు  చెబుతున్నారు. కాగా, విజిటర్‌‌‌‌ పాస్‌‌లు ఇచ్చే ఆఫీస్‌‌ను సెక్రటేరియెట్ బయట మీడియా పాయింట్ పక్క రూమ్‌‌లో ఏర్పాటు చేశారు. చాలా మందికి ఇక్కడ పాస్‌‌లు ఇస్తున్నారన్న విషయం కూడా తెలియడం లేదని, పోలీసులను అడిగితేనే తెలుస్తుందని చెబుతున్నారు.