
కంతి: వందేమాతరం నినాదంతో జాతి మొత్తం ఒక్కటయ్యేలా స్ఫూర్తినిచ్చిన గడ్డగా బెంగాల్ చిరస్మరణీయమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై మోడీ విమర్శలకు దిగారు. దీదీ అందర్నీ బయటి వాళ్లంటున్నారని, కానీ బీజేపీ గెలిస్తే ఈ గడ్డపై పుట్టిన వారినే సీఎంను చేస్తానన్నారు. పూర్బా మిడ్నాపూర్‌లోని కంతీలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోడీ పైవ్యాఖ్యలు చేశారు. బంకీం చంద్ర ఛటర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్ లాంటి గొప్పవారు బెంగాల్ నేలపై జన్మించారని.. ఈ గడ్డపై ఎవ్వరూ బయటి వ్యక్తులు కారని స్పష్టం చేశారు.