సీబీఐ ఉద్యోగులు జీన్స్, టీ షర్ట్స్ వేసుకోవద్దు

సీబీఐ ఉద్యోగులు జీన్స్, టీ షర్ట్స్ వేసుకోవద్దు

సీబీఐ అధికారులు ఫార్మల్ డ్రస్సులు మాత్రమే వేసుకుని విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (CBI) డైరెక్టర్‌ సుబోధ్‌ కుమార్‌ జైస్వాల్ . ఆయన ఇటీవ‌లే CBI డైరెక్టర్‌ గా నియామితులైయ్యారు. వచ్చి రావడంతోనే తమ దర్యాప్తు సంస్థ ఉద్యోగులు వేసుకోవాల్సిన‌ దుస్తుల విష‌యంలో ఆయ‌న తాజాగా తీసుకున్న నిర్ణ‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అధికారులు, ఇత‌ర సిబ్బంది అంద‌రూ ఫార్మ‌ల్ డ్రెస్ వేసుకునే రావాల‌ని, జీన్స్‌, స్పోర్ట్ షూలు వంటివి వేసుకుని వ‌స్తే చర్యలు తప్పవన్నారు. 

పురుషులు ఫార్మ‌ల్ చొక్కాలు, ప్యాంట్లు, బూట్లు మాత్ర‌మే వేసుకుని విధుల‌కు రావాలని సుబోధ్‌ కుమార్‌ జైస్వాల్ ఆదేశాలు జారీ చేశారు. చ‌క్క‌గా షేవింగ్ చేసుకుని రావాల్సి ఉంటుంది. అంతేకాదు.. సీబీఐలో ప‌నిచేస్తోన్న మ‌హిళాధికారులు కూడా చీర‌లు, సాధార‌ణ చొక్కాలు, సూటు, బూట్లు వేసుకుని మాత్ర‌మే రావాలన్నారు. 

మ‌హిళా సిబ్బంది జీన్సు, టీష‌ర్టులు, స్పోర్ట్స్ షూ, చెప్పులతో పాటు అన్నీ అలంకరణలతో ఆఫీసులకు రావ‌ద్ద‌ని ఆదేశించారు. ఈ నియ‌మ నిబంధ‌ల‌ను దేశ వ్యాప్తంగా సీబీఐ సిబ్బంది క‌చ్చితంగా పాటించాల్సిందేన‌ని అందులో తెలిపారు. ఈ రూల్స్ ఎప్పటి నుంచో ఉన్నా.. చాలా ఏళ్లుగా వారు ఈ నిబంధ‌న‌ను పాటించ‌డం లేద‌న్నారు.