అసెంబ్లీ ఉపఎన్నిక బరిలో హేమంత్‌ సోరెన్‌ భార్య

అసెంబ్లీ ఉపఎన్నిక బరిలో హేమంత్‌ సోరెన్‌ భార్య

రాంచీ: జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ భార్య కల్పన అసెంబ్లీ ఉపఎన్నికల్లో పోటీ చేయనున్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ఎమ్మెల్యే సర్ఫరాజ్‌ అహ్మద్‌ రాజీనామా చేయడంతో గిరిదిహ్‌ జిల్లాలోని గండే అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. దాంతో అక్కడ బైఎలక్షన్ అనివార్యమైంది. గండే అసెంబ్లీ స్థానం నుంచి మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ పోటీ చేయనున్నట్లు జేఎంఎం గురువారం ప్రకటించింది. కల్పన ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలోని బరిపాడలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. భువనేశ్వర్‌లోని ప్రత్యేక సంస్థల నుంచి ఇంజినీరింగ్, ఎంబీఏ డిగ్రీలను పొందారు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు గండే అసెంబ్లీ స్థానానికి మే 20న ఉప ఎన్నిక జరగనుంది.

x