
మద్యపానం అంటే సురాపానం అని.. అంటే మందు తాగితే అమృతం తాగినంత కిక్కిస్తుందని కొందరు వర్ణిస్తుంటారు. మందులో ఉన్న మజా అలా ఉంటుందని వాళ్ల అభిప్రాయం. అందుకే కాబోలు.. ఆల్కహాల్ అంటే అంత క్రేజ్. బాధ వేసినా.. సంతోషం వచ్చినా.. లాభం వచ్చినా.. నష్టం వచ్చినా.. చుట్టం వచ్చినా.. బంధువు పోయినా.. ఇలా ఏది జరిగినా మందుకు లింకు పెడుతూ ఏదో ఒక కారణం చేత తాగడం కామన్. కానీ ఆదేశంలో గత 73 ఏండ్లుగా ఎవరూ మందు ముట్టరంటే ఆశ్చర్యంగా లేదు.
అదే సౌదీ అరేబియా స్పెషల్. ఆ దేశంలో మందు బ్యాన్ చేసి డైమండ్ జూబిలీ దగ్గరపడుతుందంటే ఆశ్చర్యం వేయక మానదు. ఇండియాలో.. అందులో తెలుగు రాష్ట్రాలలో మందు లేకుండా ఏడు గంటలే ఉండలేరు కొందరు. అలాంటిది 73 ఏళ్లుగా ఆల్కహాల్ వినియోగానికి దూరంగా ఉన్నారు ఆదేశ ప్రజలు. కానీ కొన్నిసార్లు ట్రెండ్ కు తగ్గట్లుగా మారాల్సిన పరిస్థితి తప్పదు కదా. అందుకే ఇప్పుడు ఇన్నాళ్ల నిబంధనలు ఎత్తేసి.. మందు అమ్మకాలకు ఛాన్స్ ఇవ్వాలని సౌదీ పాలకులు డిసైడ్ అయ్యారట.
2026 ఫిఫా వరల్డ్ కప్ సౌదీలో నిర్వహించనున్నారు. అందుకోసం సౌదీ అరేబియా చారిత్రాత్మక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. Expo2030, Fifa World Cup 2034 నిర్వహణలో భాగంగా ఆల్కహాల్ పై ఉన్న బ్యాన్ ను ఎత్తేయాలనే ప్లాన్ లో ఉందట ఈ ఎడారి దేశం.
ఆల్కహాల్ అమ్మకాలకు అనుమతించడం వలన యూఏఈ (UAE), బహ్రెయిన్ దేశాలతో టూరిజంలో పోటీ పడేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు అక్కడి అధికారులు. ఫ్యూచర్ ఈవెంట్స్ అండ్ టూరిజం కోసం వైన్ , బీర్, సిడర్ మొదలైన మందును దేశ వ్యాప్తంగా 600 లొకేషన్స్ లో లైసెన్స్ ఇచ్చి అనుమతించనున్నారు. అందులో ముఖ్యంగా ఫైవ్ స్టార్ హోటల్స్, లగ్జరీ రిసార్ట్స్, Neom, సిందలా ఐలండ్, రెడ్ సీ ప్రాజెక్టు మొదలైన టూరిస్ట్ స్పాట్స్ లలో ఆల్కహాల్ ను అమ్మేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఎలాంటి ఆల్కహాల్ అమ్ముతారు?
అయితే ఇందులో కేవలం 20 శాతం ఆల్కహాల్ పర్సెంట్ కంటే తక్కువ ఉన్న బ్రాండ్స్ ను మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇవ్వనున్నారు. ఆల్కహాల్ శాతం 20 శాతానికి మించి ఉండదు. అంటే లైట్ బీర్, లైట్ వైన్.. ఇలాంటివి మాత్రమే అమ్మనున్నారు.
అదే విధంగా ఇండ్లు, షాపులు, పబ్లిక్ ప్లేస్ లలో మధ్యం వినియోగం, అమ్మకం నిషేధం. అదే విధంగా వ్యక్తిగతంగా ఎవరైనా తయారు చేయడం, వినియోగించడం కూడా నిషేధమే. లైసెన్స్ ఉన్న హోటల్స్, స్టాఫ్ మాత్రమే సర్వ్ చేయాల్సి ఉంటుంది.
73 ఏళ్ల నిషేధానికి అంతం:
సౌదీ తీసుకొస్తున్న ఆల్కహాల్ పాలసీ విజన్-2030 లో భాగంగా తీసుకొస్తున్నట్లు ఆ దేశ అధికారులు చెబుతున్నారు. ఈ నిర్ణయంతో 73 ఏళ్లుగా అనుసరిస్తున్న నిషేధానికి ముంగింపు పలికినట్లు అవుతుంది. టూరిజం, వినోదం, హాస్పిటాలిటీని పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీని వలన ఆదాయం పెరగటం తో పాటు యువతకు ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నారు.
సౌదీ అరేబియా అబ్దులాజిజ్ అల్ సౌద్ అధ్యక్షతన వహాబీ ఇస్లామ్ అనుసరించి 1932 లో ప్రత్యేక రాజ్యంగా ఏర్పాటయ్యింది. షరియా లా పాటించే ఈ దేశంలో అప్పటి నుంచి ఆల్కహాల్ పై నిషేధం ఉంది. అయితే చట్టపరంగా 1952 నుంచి పూర్తిగా బ్యాన్ చేశారు.
దారుణమైన చట్టాల నుంచి దేశాన్ని మాడ్రన్ సొసైటీ వైపు తీసుకెళ్లేందుకు యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షతన పలు మార్పులు తీసుకువస్తున్నారు. మహిళా హక్కులను కొంత వరకు పెంపొందించారు. డ్రైవింగ్ చేయడం, అథ్లెటిక్స్ లో పాల్గొనటం, పురుషులతో పార్టీలలో పాల్గొనటం మొదలైన అవకాశాలు మహిళలకు కల్పించారు.
2018 లో సినిమాలపై ఉన్న బ్యాన్ కూడా ఎత్తేశారు. ‘బ్లాక్ పాంథర్’ సినిమాను ప్రదర్శించి.. సౌదీకి తొలిసారి సిల్వర్ స్క్రీన్ ను తీసుకొచ్చారు. లేటెస్ట్ గా ఫిఫా వరల్డ్ కప్ వంటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ నిర్వహించాలనే నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆల్కహాల్ బ్యాన్ చేయడం విశేషం.