కళాకారులకు పింఛన్లు వస్తలేవ్

కళాకారులకు పింఛన్లు వస్తలేవ్
  • సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇస్తలేరు 
  •  మండలిలో గళమెత్తిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కళాకారుల సమస్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మండలిలో రాష్ట్ర సర్కార్ ను ప్రశ్నించారు. కళాకారులకు పింఛన్లు అందడం లేదని, సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇవ్వడం లేదని గళమెత్తారు. మంగళవారం జీరో అవర్‌‌‌‌ లో పలువురు సభ్యులు మాట్లాడారు. యక్షగాన కళాకారులకు రూ.3 వేల పింఛన్‌‌‌‌ ఇవ్వాలని గోరటి వెంకన్న కోరారు. దివ్యాంగ కళాకారులకు పింఛన్‌‌‌‌ అందడం లేదని శేరి సుభాశ్ రెడ్డి చెప్పారు. మెదక్ జిల్లా నుంచి ఎంతోమంది కళాకారులు ఉద్యమంలో పాల్గొన్నారని.. వారిలో ఇద్దరు, ముగ్గురికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. సాంస్కృతిక సారథిలో గొల్లకుర్మ కళాకారులకు ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదని యెగ్గె మల్లేశం తెలిపారు. పింఛన్ రావడం లేదన్నారు. గౌడశెట్టి కళాకారులను గుర్తించి, వారికీ పెన్షన్ ఇవ్వాలని గంగాధర్‌‌‌‌ గౌడ్‌‌‌‌ కోరారు. డప్పుకొట్టే వాళ్లకూ పింఛన్లు ఇవ్వాలని రాజేశ్వర్‌‌‌‌రావు విజ్ఞప్తి చేశారు. 
వాళ్లకూ గౌరవ వేతనం పెంచాలె: కవిత 
సర్పంచ్‌‌‌‌లకు పెంచినట్లే మేయర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లు, కౌన్సిలర్లకు గౌరవ వేతనం పెంచాలని ఎమ్మెల్సీ కవిత జీరో అవర్‌‌‌‌ లో కోరారు. దీనికి మంత్రి కేటీఆర్‌‌‌‌ సమాధానమిస్తూ.. నోట్‌‌‌‌ చేసుకున్నామని ఒక్క మాటలోనే ముగించారు.