V6 News

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. ఆందోళన చెందొద్దు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. ఆందోళన చెందొద్దు:  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరతపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ఏమాత్రం లేదన్నారు. కొందరు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూ యెన్సర్లు విషయం తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేయొద్దన్నారు. నేతలు, సోషల్  మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మి ప్రజలు గందరగోళంలో పడొద్దన్నారు. తొందరపడి పెట్రోల్,డీజిల్ ను ఇండ్లలో నిల్వ ఉంచుకోవద్దన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 

రాష్ట్రంలో ప్రజల అవసరాలకు కావాల్సినంత స్టాక్ ఉందన్నారుకేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.  తెలంగాణలో రోజుకు 6వేల 400 కిలో లీటర్ల  పెట్రోల్ అవసరం ఉండగా.. ఈ రోజు  10వేల 300 కిల లీటర్ల పెట్రోల్ సప్లయ్ జరిగిందన్నారు. డీజిల్ 8వేల  కిలో లీటర్ల అవసరం ఉండగా..19వేల 300 కిలో లీటర్ల సప్లయ్ చేశామన్నారు. 

అమెరికా , ఇరాన్ యుద్దం కారణంగా పెట్రోల్ డీజిల్ దిగుమతిలో కొంత సమస్య ఏర్పడింది వాస్తవమే.. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో  దేశంలోగానీ, రాష్ట్రంలో గానీ పెట్రోల్ డీజిల్ కొరత లేదన్నారు. 88 శాతం చమురు ఉత్పత్తులను ప్రపంచ దేశాలనుంచి  దిగుమతి చేసుకుంటున్నాం..మనకు కావాల్సినంత స్టాక్ ఉందన్నారు కిషన్ రెడ్డి. ఒకవేళ స్టాక్ లేకపోతే పజలకు చెప్తాం.. కావాలనే ప్రతిపక్ష నేతల  రేట్లు పెరుగుతాయనిప్రచారం చేస్తున్నారు వారిమాటల నమ్మొద్దన్నారు కిషన్ రెడ్డి. 

రాహుల్ గాంధీ లాంటి ప్రతి పక్ష నేతలు రాజకీయ నేతలు చేస్తున్న పానిక్ కామెంట్లతో ప్రజలు గందరగోళానికి గురవతున్నారు. పెట్రోల్, డీజిల్ ను ఇండ్లలో స్టాక్ పెట్టుకుంటున్నారు.. అసలే ఎండాకాలం ఇది మంచిది కాదని కిషన్ రెడ్డి ప్రజలకు సూచించారు.