కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని ఫిల్టర్‌బెడ్ ప్రైమరీ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల విద్యాభ్యాసం పెంపొందించడం, కుటుంబ బంధాల బలోపేతం కోసం గంటపాటు ‘నో ఫోన్– -నో టీవీ’ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శనివారం స్కూల్‌లో పేరెంట్స్, టీచర్ల సమావేశం (పీటీఎం) నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల శ్రేయస్సుపై పలు అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ‘నో ఫోన్ - నో టీవీ’ పాటించాలని తల్లిదండ్రులు నిర్ణయం తీసుకొని ప్రతిజ్ఞ చేశారు.
