చెన్నూర్, వెలుగు: చెన్నూరులో కబ్జాకు గురైన సుమారు రూ.10కోట్ల విలువైన జగన్నాథ స్వామి ఆలయ భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. మంచిర్యాల జిల్లా చెన్నూరు శివారులోని సర్వే నంబర్ 869/21లో ఉన్న సుమారు 3.20 ఎకరాల దేవాదాయ శాఖ భూమిని విలేకరులమని చెప్పుకునే కనుకుట్ల వెంకటేశ్, నూకల సతీశ్.. కొంతకాలంగా అధికారులను బ్లాక్‌మెయిల్ చేస్తూ భూమిని కబ్జా చేశారు.
ఆ భూమిలో మామిడి మొక్కలు నాటి, ఐరన్ ఫెన్సింగ్ వేశారు. దీంతో అధికారులు శనివారం భూమి స్వాధీనానికి వెళ్లగా కబ్జాదారులు.. కర్రలు, పెట్రోల్ బాటిళ్లు, కారం పొడితో అధికారులపై దాడికి యత్నించారు. పోలీసుల సాయంతో అధికారులు రెండు జేసీబీలతో 200 మామిడి మొక్కలు, ఐరన్ ఫెన్సింగ్, సిమెంట్ పిల్లర్లను తొలగించారు. ఇద్దరు విలేకరులతోపాటు సోనీ వెంకన్న, కేదాస్ సతీశ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
