ఢిల్లీలో లాక్ డౌన్ సడలింపు లేదు

ఢిల్లీలో లాక్ డౌన్ సడలింపు లేదు
  • వారం తర్వాత డిసైడ్ చేస్తాం: సీఎం అరవింద్ కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఢిల్లీలో లాక్ డౌన్ సడలింపు లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించారు. వారం రోజుల తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు. “దేశ జనాభాలో రెండు శాతం మంది ఢిల్లీలో ఉంటున్నారు. దేశంలోని మొత్తం కరోనా కేసుల్లో 12 శాతం కేసులు ఇక్కడ రికార్డయ్యాయి. ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి లాక్ డౌన్ లో ఎలాంటి సడలింపు ఇవ్వరాదని డిసైడ్ చేశాం. ప్రజలు సోషల్ డిస్టెన్స్ నిబంధనలు పాటించాలి. కరోనా కేసులు నమోదు కాని ప్రాంతాల్లో ఈ నెల 20 నుంచి లాక్ డౌన్ సడలించాలని కేంద్రం సూచించింది. ఢిల్లీలో 11 జిల్లాలు ఉన్నాయి. అన్నీ హాట్ స్పాట్లే. ఆంక్షల సడలింపు లేదు. గత కొన్ని రోజులుగా టెస్టుల సంఖ్యను పెంచాం” అని అన్నారు. ఢిల్లీలో 1,893 మందికి కరోనా సోకగా 43 మంది చనిపోయారు. 207 మంది కోలుకున్నారు.