
హైదరాబాద్ లో రేపు(సెప్టెంబర్ 1న) ఉదయం 11 గంటల నుంచి ఎల్లుండి (సెప్టెంబర్ 2) ఉదయం 7 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరా కు అంతరాయం ఏర్పడనుంది. జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, ప్రశాసన్ నగర్, గచ్చిబౌలి, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్ ప్రాంతాల్లో మంచినీళ్ల సరఫరా బంద్ కానుంది.
కృష్ణా ఫేజ్ 2 పైప్ లైన్ రిపేర్ చేపట్టనున్నారు అధికారులు. అత్తాపూర్ మూసీ వద్ద పైప్ లైన్ పనులు రిపేర్ చేయడంతో పాటు మైలార్ దేవ్ పల్లి వద్ద కొత్త వాల్వ్ లు బిగించనున్నారు. ఈ క్రమంలోనే పలు ఏరియాలకు మంచినీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. నీటి సరఫరా ప్రభావిత ప్రాంతాల ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని కోరారు వాటర్ బోర్డు అధికారులు