గుర్తింపు వచ్చేసింది : వాళ్ల కోసం ప్రత్యేక వార్డు.. దేశంలోనే ఫస్ట్ టైం..

గుర్తింపు వచ్చేసింది : వాళ్ల కోసం ప్రత్యేక వార్డు.. దేశంలోనే ఫస్ట్ టైం..

లింగమార్పిడి చేసుకునే వారికి ఉత్తర్​ప్రదేశ్ లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రి గుడ్​ న్యూస్​ చెప్పింది. నోయిడా జిల్లా ఆసుపత్రిలో లింగమార్పిడి చేయించుకునే వ్యక్తుల కోసం ప్రత్యేక రిజిస్ట్రేషన్, ఫార్మసీ కౌంటర్​ని ప్రారంభించింది. 

ట్రాన్స్ జెండర్ల కోసం ఏర్పాటు చేస్తున్న ఈ సదుపాయం దేశంలోనే ఫస్ట్​ది అని వైద్యులు చెబుతున్నారు. ఈ కేంద్రాల్లో వారి  డేటాను సేకరించేందుకు ప్రత్యేక కౌంటర్​ ఉంటుందని వివరించారు.  

ట్రాన్స్​జెండర్​లు ఓపీ నమోదు ప్రక్రియలో వివక్షను ఎదుర్కునేవారు. ట్రాన్స్​జెండర్​ సంఘం  నుంచి వచ్చిన కంప్లెంట్స్ వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు చెబుతున్నారు. 

ALSO READ :గడ్డి మందులు కూడా నకిలీవే.. 

ప్రిస్క్రిప్షన్​ప్రకారమే మందులు వాడేలా చర్యలు తీసుకుంటామని డాక్టర్లు వెల్లడించారు. ఈ చర్యతో లింగమార్పిడి చేసుకునే వారి సంఖ్య పెరుగుతుందని డాక్టర్​ అగర్వాల్ పేర్కొన్నారు.