బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగి జైలు నుంచి విడుదల

బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగి జైలు నుంచి విడుదల

ఢిల్లీ శివార్లలోని నోయిడా హౌసింగ్‌ సోసైటీలో మహిళపై దాడి చేసిన ఘటనలో అరెస్టైన బీజేపీ నేత శ్రీకాంత్‌ త్యాగి జైలు నుంచి విడుదల అయ్యారు. త్యాగి అనుచరులు, మద్దతుదారులు ఆయనకు స్వాగతం పలికారు. ఆయనకు పూలమాలలు వేసి 'శ్రీకాంత్ భయ్యా జిందాబాద్' అంటూ నినాదాలు చేశారు. స్వీట్లు కూడా పంచిపెట్టారు. తనపై వచ్చిన గ్యాంగ్ స్టర్ ఆరోపణలు అవాస్తవమని శ్రీకాంత్ అన్నారు. తన రాజకీయ జీవితానికి ముగింపు పలికే ముగించే ప్రయత్నంలో భాగంగా.. తన చెల్లికి తనకు మధ్య వివాదాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. జైలులో ఉన్నప్పుడు తనకు, తన కుటుంబానికి అండగా ఉన్న వారందరికీ త్యాగి కృతజ్ఞతలు తెలిపారు. తనను అప్రతిష్టపాలు చేయడంతో పాటు విచారణ కూడా ఏకపక్షంగా జరిగిందని మండిపడ్డారు.

ఢిల్లీ శివార్లలోని నోయిడా హౌసింగ్‌ సోసైటీలో మహిళపై దాడి చేయడంతో యూపీ పోలీసులు శ్రీకాంత్‌ త్యాగిని అరెస్ట్‌ చేశారు. హౌసింగ్‌ సోసైటీలో ఆక్రమణలను ప్రశ్నించిన మహిళపై దాడికి పాల్పడినట్లు ఆయనపైారోపణలు వచ్చాయి. విచారణలో భాగంగా త్యాగికి నేరచరిత్ర ఉన్నట్టు గుర్తించారు. అతడిపై 9 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు నోయిడా హౌసింగ్‌ సోసైటీలో త్యాగి నివాసంలోని ఆక్రమణలను పోలీసులు బుల్‌డోజర్లతో కూల్చేశారు.