చోర్ బజార్ మూవీ సాంగ్ విడుదల

చోర్ బజార్ మూవీ సాంగ్ విడుదల

ఆకాశ్ పూరి  హీరోగా నటిస్తున్న సినిమా ‘చోర్ బజార్. గెహన సిప్పీ కథానాయికగా నటిస్తోంది. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తనకంటూ గుర్తింపు పొందిన జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా  త్వరలో విడుదల కానుంది.  లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్గా రూపొందుతున్న "చోర్ బజార్" 
సినిమా ప్రమోషన్ స్టార్ చేశారు చిత్ర దర్శకుడు. ఇందులో భాగంగా  ఈ చిత్రంలోని 'నూనుగు మీసాల' లిరికల్ సాంగ్  స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా విడుదల అయింది. 
ఇది హీరోయిన్ సోలో సాంగ్.  ప్రియుడు తనను ఎలా ఆకర్షించాడు. అతని గురించి తానెంతగా ఎదురుచూస్తుందో ఈ పాట ద్వారా చెబుతుంది నాయిక. ఈ పాటను సురేష్ బొబ్బిలి స్వరపర్చగా...కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించారు. లక్ష్మీ మేఘన పాడారు. భాను కొరియోగ్రఫీ అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, చోర్ బజార్ , జడ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 

దర్శకుడు పూరిజగన్నాథ్ కుమారుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన  ఆకాష్ పూరి ..చిన్నతనం నుంచే పలు సినిమాల్లో నటించి గుర్తింపు పొందాడు. అయితే ధోని సినిమాలో నటనకు గానూ ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత తొలిసారిగా ఆంధ్రాపోరితో హీరోగా మారాడు. అది బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయింది. ఆ తర్వాత  విభిన్న కథాంశంతో మెహబూబాలో నటించినా..ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ప్రస్తుతం చోర్ బజార్తో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.