V6 News

అమెరికాలో కూలిన చిన్న విమానం..నార్త్ డకోటా సెనేటర్ లిజ్ కాన్మీ, పైలట్ మృతి

అమెరికాలో కూలిన చిన్న విమానం..నార్త్ డకోటా సెనేటర్ లిజ్ కాన్మీ, పైలట్ మృతి

మినియాపొలిస్: అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలో చిన్న విమానం కూలిపోయింది. శనివారం మినియాపొలిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉత్తరాన ఉన్న క్రిస్టల్ విమానాశ్రయం నుంచి 11:51 గంటలకు బయల్దేరిన విమానం.. కొద్దిసేపటికే బ్రూక్లిన్ పార్క్ నగరంలోని ఒక పార్కులో కుప్పకూలింది.  ఇందులో ప్రయాణిస్తున్న నార్త్ డకోటా సెనేటర్​లిజ్ కాన్మీ, పైలట్ అక్కడికక్కడే మృతి చెందినట్లు  బ్రూక్లిన్ పార్క్ పోలీస్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ మాట్ రాబే తెలిపారు.  

ఆమె మరణంపై నార్త్ డకోటా డెమోక్రటిక్-నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పార్టిసన్ లీగ్ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రజా విద్య, పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వంలో పారదర్శకత కోసం నిరంతరం పోరాడిన యోధురాలిగా ఆమెను కొనియాడింది.