ఆధార్​పాన్​ లింక్​ చేయకుంటే.. రూ.6 వేల పెనాల్టీ!

ఆధార్​పాన్​ లింక్​ చేయకుంటే..  రూ.6 వేల పెనాల్టీ!

న్యూఢిల్లీ: పాన్​కార్డుతో ఆధార్ కార్డును ఇప్పుడు లింక్ చేయాలంటే పెనాల్టీగా రూ.6 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో పాన్ ఆధార్ లింక్ ఆలస్యానికి రూ.వెయ్యి ఫైన్  కాగా ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్) ఆలస్యంగా ఫైల్ చేసినందుకు మరో రూ.5 వేలు అని నిపుణులు చెబుతున్నారు. 

ఈ ఏడాది జూన్ 30 నాటికి పాన్, ఆధార్ లింక్ చేయకుంటే జులై 1 నుంచే పాన్ కార్డు పనికిరాకుండా పోతుంది. ఇప్పుడు రూ.వెయ్యి ఫైన్ చెల్లించినా పాన్ కార్డు మళ్లీ యాక్టివేట్ కావడానికి గరిష్ఠంగా 30 రోజులు పడుతుంది. కానీ ఐటీఆర్ ఫైలింగ్ కు మరో 28 రోజులు మాత్రమే గడువు ఉంది. 

దీంతో గడువు (జులై 31)లోగా ఐటీఆర్​ ఫైల్ చేయడం సాధ్యం కాదు. ఐటీఆర్ ఆలస్యంగా ఫైల్ చేసినందుకు రూ.5 వేలు ఫైన్ చెల్లిం చాల్సి ఉంటుంది. అయితే, రూ.5 లక్షల లోపు వార్షిక  ఆదాయం ఉన్నవారు ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయ డానికి (గడువు దాటిన తర్వాత) రూ.వెయ్యి, పాన్ ఆధార్ లింక్  ఆలస్యానికి మరో వెయ్యి.. మొత్తం రూ.2 వేలు చెల్లించాల్సి ఉంటుంది.