
- మేడిపల్లిలో ఉపాధి కూలీల నిరసన
జగిత్యాల జిల్లా: మేడిపల్లి మండల కేంద్రంలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. ఉపాధి హామీ కింద తవ్విన కందకాలను కొందరు వ్యక్తులు పూడ్చివేస్తున్నారంటున్నారు కూలీలు. దీంతో మేడిపల్లి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. స్మశాన వాటిక దారి కోసం రోడ్డు బాగు చేసి కందకాలు తీశామన్నారు కూలీలు. అయితే అది తమ స్థలం అంటూ అదే గ్రామానికి చెందిన రవి, రాజేశ్వర్ రెడ్డి, ప్రభాకర్ లు కూలీలను అడ్డుకున్నారని గ్రామ సర్పంచ్ వరలక్ష్మీ తెలిపారు. అంతే కాకుండా ఇదే విషయంపై గతంతో తన భర్తపై కూడా దాడి చేశారని చెబుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఉపాధి హామీ కూలీలు.