విద్యార్థి సంఘాల ధర్నా.. ఇంటర్ బోర్డు ఎదుట ఉద్రిక్తత

విద్యార్థి సంఘాల ధర్నా.. ఇంటర్ బోర్డు ఎదుట ఉద్రిక్తత

నాంపల్లి: రీసెంట్ గా విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన తప్పిదాలకు బలైన విద్యార్థులకు కోసం పోరాడుతుంటే అడ్డుకుంటున్నారని NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ అన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు కనీసం స్పందించడకుండా, పోలీసులను అడ్డం పెట్టుకుని అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఇది వాళ్ల తప్పుల్ని కప్పిపుచ్చుకోవడంలో భాగమేనని ఆరోపించారు. విద్యార్థుల ప్రాణాలకు బాధ్యుతలైన ప్రభుత్వం, ఇంటర్మీడియట్ బోర్డు తీరుకు నిరసనగా ఈ నెల 20వ తేదీ (సోమవారం) రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ కాలేజీల బంద్ కు పిలుపునిస్తున్నట్లు బల్మూరి వెంకట్ ప్రకటించారు. 

కాగా, ఇంటర్ ఫలితాల విషయంలో ఫ్రీగా రీవాల్యుయేషన్ చేయడంతోపాటు సాంకేతిక లోపాలను సరిచేయాలంటూ ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఏబీవీపీ, ఎన్ఎస్ యూఐ సంఘాలు ఇంటర్మీడియట్ బోర్డును ముట్టడించడానికి ప్రయత్నించడంతో పోలీసులు పలువురు విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇకపోతే, ఇంటర్ ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు. కరీంనగర్ పద్మానగర్ ఇంటర్మీడియట్ విద్యా శాఖ కార్యాలయం ముందు ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నాకు దిగారు. 

మరిన్ని వార్తల కోసం: 

బాలిక ఫిర్యాదు: మరుగుదొడ్లు శుభ్రం చేసిన మంత్రి

18 ఏళ్లకే ప్రధానిని ఎంచుకోవచ్చు.. పెళ్లి చేసుకోకూడదా?

ఐఏఎంసీ ఏర్పాటుకు హైదరాబాదే బెస్ట్ ప్లేస్