హైదరాబాద్ గ్లోబల్ డెస్టినేషన్ కాబోతోంది

హైదరాబాద్ గ్లోబల్ డెస్టినేషన్ కాబోతోంది

హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఆర్బి్ట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) మొదలైంది. నానక్ రామ్ గూడాలోని వీకే  టవర్స్ లో ఐఏఎంసీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ట్రస్టీలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ హిమా కోహ్లి,  సుప్రీం రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, హోం శాఖ మంత్రి మహమూద్ అలీతోపాటు టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.  

ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ వస్తది

‘హైదరాబాద్ ను అతిగా ప్రేమించే వ్యక్తుల్లో జస్టిస్ ఎన్వీ రమణ ఒకరు. ఐఏఎంసీని ఈ నగరంలో ఏర్పాటు చేయడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. భవిష్యత్తులో అనేక విషయాల్లో హైదరాబాద్ గ్లోబల్ డెస్టినేషన్ కాబోతోంది. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. కోర్టుల్లో పలు కారణాలతో పరిష్కారం కాకుండా ఉన్న కేసులను ఆర్బిట్రేషన్ సెంటర్లకు తీసుకెళ్లడం అంతర్జాతీయంగా జరుగుతోంది. అలాంటి ఫెసిలిటీ ఇప్పుడు మన దేశంలో తొలిసారిగా హైదరాబాద్ లో రావడం గర్వకారణం. ఈ సెంటర్ అన్ని రకాలుగా మన దేశానికి, నగరానికి అన్ని విధాలుగా గొప్ప పేరు, ప్రతిష్టలు సంపాదిస్తుందని ఆశిస్తున్నాం’ అని కేసీఆర్ చెప్పారు. ఈ సెంటర్ కు ఇంటర్నేషనల్ గా మంచి రెప్యుటేషన్ వస్తుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఐఏఎంసీకి ప్రభుత్వం నుంచి కావాల్సిన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని కేటీఆర్ అన్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

18 ఏళ్లకే ప్రధానిని ఎంచుకోవచ్చు.. పెళ్లి చేసుకోకూడదా?

ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెంతమంది విద్యార్థులు బలి కావాలి?

దళిత బంధు అర్హుల బాధ్యత ఎమ్మెల్యేలదే..