చంచల్ గూడ జైలు నుంచి NSUI నేతలు విడుదల

చంచల్ గూడ జైలు నుంచి NSUI నేతలు విడుదల

హైదరాబాద్ : హైదరాబాద్ చంచల్ గూడ జైలు నుంచి తెలంగాణ రాష్ట్ర NSUI అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తో పాటు మరో 18 మంది విడుదలయ్యారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్శిటీకి అనుమతించాలంటూ ఈనెల 1వ తేదీన NSUI నేతలు వీసీ ఛాంబర్ ముందు ఆందోళనకు దిగారు. దీంతో వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి, పోలీసులు అరెస్ట్ చేశారు. NSUI నేతలను కోర్టులో హాజరుపరచడంతో 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ తర్వాత పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.

తాజాగా బెయిల్ రావడంతో జైలు నుంచి NSUI నాయకులు విడుదలయ్యారు. జైలు నుంచి బయటకొచ్చిన బల్మూరి వెంకట్ కి NSUI నేతలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తమపై అక్రమ కేసులు పెట్టినా, జైల్లో బంధించినా ప్రజా సమస్యలపై పోరాటం ఆపేది లేదన్నారు బల్మూరి వెంకట్.

మరిన్ని వార్తల కోసం.. 

శ్రీలంకలో కొనసాగుతున్న నిరసనలు

కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నాయి

సంక్షేమ పథకాలకు డబ్బుల్లేవు.. కానీ కమీషన్ల కాళేశ్వరానికి కొదవలేదు