శ్రీలంకలో కొనసాగుతున్న నిరసనలు

శ్రీలంకలో కొనసాగుతున్న నిరసనలు

కొలంబో: శ్రీలంక రావణకాష్టంలా రగులుతూనే ఉంది. ప్రధాని మహిందా రాజపక్స రాజీనామా చేసినా జనం ఆగ్రహ జ్వాల చల్లారడం లేదు. తాజాగా శ్రీలంక రాజ‌ధాని కొలంబోకు 250 కిలోమీట‌ర్ల దూరంలోని హంబన్‌టోటలోని రాజపక్స పూర్వీకుల నివాసానికి నిరసనకారులు నిప్పు పెట్టారు. అంతటితో ఆగకుండా రాజపక్స మ్యూజియాన్ని ధ్వంసం చేశారు. మహిందా కేబినెట్‌లోని పలువురు మంత్రుల నివాసాలను సైతం ఆందోళనకారులు తగలబెట్టారు. నిరసనలు జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండటంతో భయపడిన రాజపక్స కుటుంబం నౌకా స్థావరంలో తలదాచుకుంటోంది. మహిందా రాజపక్స, ఆయన కుటుంబసభ్యులను హెలికాప్టర్‌లో ఈశాన్య ప్రావిన్సుల్లోని ట్రింకోమలి నావెల్ బేస్‌కు తరలించినట్టు సమాచారం. 

మహిందా రాజపక్స నావెల్ బేస్లో తలదాచుకుంటున్న విషయం తెలియడంతో ఆందోళనకారులు దాని ఎదుట నిరసన చేప్టటారు. సోమవారం నుంచి నిరసనలు మరింత తీవ్రమై పలు చోట్ల హింసకు దారి తీశాయి. ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. భారీ ఆస్తి నష్టం కలిగింది. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనన్లు ప్రయోగిస్తున్నారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో బుధవారం ఉదయం వరకు శ్రీలంకవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు.

 

మరిన్ని వార్తల కోసం..

కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నాయి

సంక్షేమ పథకాలకు డబ్బుల్లేవు.. కానీ కమీషన్ల కాళేశ్వరానికి కొదవలేదు