గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్ఎన్నికల్లో సింగరేణి ఉద్యోగులు పోటీ చేసే అవకాశం కల్పించడంతో వారు సైతం బరిలో నిలిచారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేందుకు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. 9వ డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఓసీపీ 5 కార్మికుడు కనుకుంట్ల శంకర్, 10వ డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థిగా ఓసీపీ 5 కార్మికుడు మండ రమేశ్, 50వ డివిజన్లోబీఆర్ఎస్ తరఫున చల్లా రవీందర్‌రెడ్డి(ఓసీపీ 3లో హెడ్‌ఓవర్‌మెన్), 54వ డివిజన్‌లో బీఆర్ఎస్ తరఫున ఓసీపీ 3 సిహెచ్‌పీలో ఫిట్టర్‌గా పనిచేస్తున్న ఇనుముల సత్యనారాయణ ఎన్నికల బరిలో నిలిచారు.
14వ డివిజన్ నుంచి కాంగ్రెస్ తరఫున సింగరేణి మాజీ ఉద్యోగి శంకర్‌నాయక్, 16వ డివిజన్‌లో కాంగ్రెస్ తరఫున ఓసీపీ 1 ఉద్యోగి గడ్డం తిరుపతి భార్య భాగ్యలక్ష్మి, 19వ డివిజన్‌లో కాంగ్రెస్ నుంచి మాజీ ఉద్యోగి మారెల్లి రాజిరెడ్డి భార్య సుశీల ఎన్నికల్లో పోటీ పడుతున్నారు.
