- ఎన్నికలప్పుడే దేవుళ్లు గుర్తుకు వస్తారు
- కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌పై ఆది శ్రీనివాస్ ఫైర్
వేములవాడ, వెలుగు: పదేళ్లకు పైగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, ఎంపీగా, కేంద్ర సహాయ మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్.. వేములవాడ రాజన్న ఆలయానికి, పట్టణానికి ఇన్నాళ్లుగా వరదలా నిధులెందుకు తేలేదని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ఫైర్ అయ్యారు. గురువారం నాంపల్లి 5, 6, తిప్పాపూర్ 7వ, 8వ వార్డులో, కోనాయిపల్లి 13వ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు లీడర్లు ఎన్నికలప్పుడే వచ్చి ఏదో మాట్లాడుతూ గిచ్చి కయ్యం పెట్టుకోవాలని చూస్తుంటారని బండి సంజయ్‌ను ఉద్దేశించి కామెంట్ చేశారు. అభివృద్ది, సంక్షేమంపై ఏం మాట్లాడాలో అర్థంకాక ఎన్నికలు రాగానే దేవుళ్లు గుర్తుకు వస్తారన్నారు. తాను తిప్పాపూర్‌లోని పోచమ్మను నిత్యం దర్శనం చేసుకుంటానని గుర్తుచేశారు.
పట్టణంలో ఎక్కడికి వెళ్లినా అనేక సమస్యలు ఉన్నాయని ప్రజలు తమ దృష్టికి తీసుకొస్తున్నారని, కాంగ్రెస్ కౌన్సిలర్లు గెలిస్తేనే వాటి పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. ప్రచారంలో సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, సాగారం వెంకటస్వామి, అక్కనపల్లి నరేశ్, తదితరులు పాల్గొన్నారు.
