మున్సి పాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం : ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి

మున్సి పాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం : ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి
  • ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్​రెడ్డి

కందనూలు, వెలుగు:  నాగర్ కర్నూల్ జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు  గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో  ఆయన మాట్లాడారు. గతంలో ఇచ్చిన తులం బంగారం హామీ అమలుపై స్పందిస్తూ, ప్రస్తుతం బంగారం ధర రూ. 1.60 లక్షలకు చేరడం వల్ల ఆ హామీ నెరవేర్చడం కష్టతరమైందని పేర్కొన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని డ్రగ్స్ మయంగా మార్చారని, జాతిపిత అని పిలుచుకునే అర్హత ఆయనకు లేదని విమర్శించారు.

బీజేపీ మతాల మధ్య చిచ్చు పెడుతూ దేశాన్ని మూడు ముక్కలు చేయాలని చూస్తోందని, గాంధీని చంపిన గాడ్సే ఆ పార్టీకి చెందినవాడేనని ఆరోపించారు. ఫోన్ టాపింగ్ అనేది క్షమించరాని నేరమని, వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని మండిపడ్డారు. రాహుల్ గాంధీ స్ఫూర్తితో సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని, బీసీల రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసినా గవర్నర్ దానిని పెండింగ్‌‌‌‌‌‌‌‌లో పెట్టారని విమర్శిస్తూ, ప్రజలందరూ కాంగ్రెస్  ను  ఆదరించాలని కోరారు.