మున్సి పల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్ పమేలా సత్పతి

మున్సి పల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్ పమేలా సత్పతి
  • కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు  చేసినట్లు కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణికుముదిని నిర్వహించిన  వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో జరగనున్న ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు.

మొత్తం 140 వార్డుల్లో 625 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది రెండోదశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని, 20 శాతం సిబ్బందిని రిజర్వులో ఉంచినట్లు తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజి వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, తదితరులు పాల్గొన్నారు.