
జ్యోతినగర్, వెలుగు : ఎన్‌టీపీసీలో మరో 176 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ కోసం సోమవారం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేదార్ రంజన్ పాండ్ భూమి పూజ చేశారు. ఇప్పటికే 110 మెగావాట్ల ప్రాజెక్ట్ ఉండగా, మరో 56 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్, 120 మెగావాట్ల గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయనున్నారు.
ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ క్లీన్ ఎనర్జీ పట్ల ఎన్టీపీసీ నిబద్ధతో పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ జాతీయ కార్యదర్శి, ఎన్‌బీసీ మెంబర్ బాబార్ సలీంపాషా, ఎన్టీపీసీ జీఎంలు పాల్గొన్నారు.