ఆకాశంలో బ్యానర్ ఎగరేసిన ఎన్టీఆర్ అభిమానులు.. వీడియో వైరల్ 

ఆకాశంలో బ్యానర్ ఎగరేసిన ఎన్టీఆర్ అభిమానులు.. వీడియో వైరల్ 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రిబుల్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాధించుకున్నారు. ఆర్ఆర్ఆర్.. ఆస్కార్ అవార్డ్ వేడుకలకు వెళ్లినప్పుడు అక్కడి అభిమానులు ఎన్టీఆర్ కు ఘన స్వాగతం పలికారు. యూఎస్ ఫ్యాన్స్ తో మాట్లాడుతూ.. వాళ్లతో సెల్ఫీలు దిగాడు. ఈ క్రమంలో యుఎస్‌లోని ఎన్టీఆర్ అభిమానులు ఇటీవల తమ అభిమాన హీరో పట్ల వినూత్నంగా ప్రేమను చాటుకున్నారు.  

ఎన్టీఆర్ పై ఆకాశమంత అభిమానాన్ని చాటుకున్నారు. విమానానికి బ్యానర్‌ కట్టి ‘థాంక్యూ ఎన్టీఆర్. కాంట్ వెయిట్ ఫర్ ఎన్టీఆర్30’ అంటూ రాబోయే ప్రాజెక్ట్ ఎన్టీఆర్30 కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వీడియోని ఎన్టీఆర్ యూఎస్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రపంచంలోని టాప్ సినీ ఇండస్ట్రీ హాలీవుడ్ గడ్డపై ఒక టాలీవుడ్ హీరో బ్యానర్ గాలిలో ఎగురవేస్తూ, సెలబ్రేట్ చేసుకోవడంపై నెటిజెన్స్ సంబర పడిపోతున్నారు. ‘ఎన్టీఆర్30 మ్యాన్ ఆఫ్ మాస్ మేనియా కోసం వెయిట్ చేస్తున్నాం’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.