
అహ్మదాబాద్ సర్కారు దవాఖానలో నర్స్ నిర్లక్ష్యం
గుజరాత్: ప్రభుత్వ హాస్పిటళ్లలో నర్స్ ల నిర్లక్ష్యంపై మరో ఉదాహరణ బయటకొచ్చింది. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లోని గవర్నమెంట్ హాస్పిటల్ లో ఈ ఇన్సిడెంట్ జరిగింది.
అహ్మదాబాద్ లో పేదల పెన్నిధి లాంటి వీఎస్ హాస్పిటల్ కు మే 29న 5 నెలల పసికందను తీసుకొచ్చారు పేరెంట్స్. దగ్గు, జలుబు సమస్యలతో బాధపడుతున్న చిన్నారికి.. న్యూమోనియా వచ్చిందని చెప్పిన డాక్టర్లు.. హాస్పిటల్ లో అడ్మిట్ చేయించి ట్రీట్ మెంట్ ఇచ్చారు. ట్రీట్మెంట్ ముగిసిన తర్వాత డిశ్చార్జ్ కు పర్మిషన్ ఇచ్చారు డాక్టర్లు. చిన్నారి చేతికి ఉన్న కాన్యులా ఇంజెక్షన్ ను తీసే క్రమంలో… బ్యాండేజ్ ను కత్తెరతో కత్తిరించేందుకు నర్స్ ప్రయత్నిచింది. నిర్లక్ష్యంగా .. చిన్నారి బొటన వేలును కత్తిరించేసింది నర్స్.
రంజాన్ పండుగ నాడు డిశ్చార్జ్ అవుతున్నామని సంబరపడితే… నర్స్ తమ ఆనందాన్ని దూరం చేసిందని బాధపడింది తల్లి ఫరా బాను. బ్యాండేజ్ తీయడానికి కత్తెర ఉపయోగించరమే సంగతి కూడా ఆమెకు తెలీదా అని ప్రశ్నిచింది. విషయం తెల్సుకున్న హాస్పిటల్ యాజమాన్యం.. పసికందుకు చేతి బొటనవేలు అతికించేలా సర్జరీకి ఒప్పుకున్నారు. ఈ విషయం పోలీసులదాకా వెళ్లడంతో కేసు నమోదుచేశారు.
ఇటీవలే ఈ హాస్పిటల్ లో ఓ డెడ్ బాడీని తారుమారు చేసి బాధితులకు అందించిన సంఘటన కూడా బయటపడింది.