హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్కు చెందిన సీనియర్జర్నలిస్ట్ షేక్ఇస్లాముద్దీన్ ను ఒడిశా ప్రభుత్వం అవార్డుతో సత్కరించింది. నేషనల్ ప్రెస్ డేను పురస్కరించుకుని శనివారం రాత్రి భువనేశ్వర్లో నేషనల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ బోర్డు(ఎన్‌జేడబ్ల్యూబీ) దూరదర్శన్ కేంద్రం, ఏఐఆర్, రీజనల్ ఔట్‌రీచ్ బోర్డు, ఫీల్డ్ ఔట్రీచ్ బోర్డు, అకాడమీ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్, అక్కడి రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేశ్ పూజారి పాల్గొని అవార్డులు అందజేశారు. ఇస్లాముద్దీన్తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన మరో ఏడుగురిని ఎంపిక చేసిన ఒడిశా సర్కార్అవార్డులు అందజేసింది.

