తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ 50 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్ ప్రజలను ఊరఢించి మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరో పార్టీ పోటీ లేదన్నారు. ఇక్కడ బీజేపీ మొలకెత్తే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. 2026 ఏప్రిల్ 29న నిజిమాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీలతో కలిసి శంకుస్థాపన చేశారు.
రాహుల్ గాంధీ చేతుల మీదుగా నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు. దేశం మొత్తం రాహుల్ గాంధీ వైపు చూస్తోందని.. ప్రధాని పదవిని సైతం రాహుల్ గాంధీ త్యాగం చేశారని చెప్పారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు రావడం ఖాయమని అన్నారు . దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. దేశం
తెలంగాణ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం లేదన్నారు. బీజేపీ కుల మతాల చిచ్చు రేపుతోందని విమర్శించారు. బీఆర్ఎస్ కుటుంబ తాగాదాలతో కొట్లాడుతోంది.. ఆ ప్రీ పార్టీ ప్రజలకు ఏం చేస్తుందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తామని చెప్పారు. మంచి నమునాతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గేది లేదన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క.. రెండున్నరెళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎంతో అభివృద్ధి చేసిందన్నారు. ఏడాది కాలంలో 4 లక్షల ఇండ్లు కట్టి ఇచ్చినట్లు చెప్పారు. నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

