V6 News

OTT Review: ఓటీటీలోకి సెల్వరాఘవన్ విలేజ్ థ్రిల్లర్.. IMDBలో ఏకంగా 9 రేటింగ్.. స్టోరీ ఏంటంటే?

OTT Review: ఓటీటీలోకి సెల్వరాఘవన్ విలేజ్ థ్రిల్లర్.. IMDBలో ఏకంగా 9 రేటింగ్.. స్టోరీ ఏంటంటే?

వర్సటైల్ డైరెక్టర్ కం యాక్టర్ సెల్వరాఘవన్ మరో కొత్త సినిమాతో వచ్చాడు. సెల్వ ప్రధాన పాత్రలో ‘మణిదన్ దైవమంగళం’ (Manithan Deivamagalam) అనే విలేజ్ రస్టిక్ డ్రామాతో ఆడియన్స్ని పలకరించాడు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. శుక్రవారం మే1 నుంచి Sun NXTలో స్ట్రీమింగ్ కానుంది.

అయితే, ప్రస్తుతం తమిళంలో మాత్రమే అందుబాటులోకి రానుంది. తెలుగులో త్వరలోనే అలరించనుందని మేకర్స్ తెలిపారు. డెనిస్ మంజునాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైంది. రిలీజ్ అయిన నెల రోజుల్లోపే ఓటీటీలోకి రావడం విశేషం.

 విలేజ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ మూవీలో, స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నించిన ఒక సాధారణ వ్యక్తి ఎదుర్కొన్న సమస్యలు ప్రధాన కథ. ఈ చిత్రంతో కన్నడ నటి ఖుషీ రవి తమిళంలో డెబ్యూ చేసింది. అలాగే మైమ్ గోపీ, వైజీ మహేంద్రన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి IMDBలో 9 రేటింగ్ ఉండటం విశేషం.

కథేంటంటే:

ఈ సినిమా నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేని మహిళలపై ఒక వడ్డీ వ్యాపారీ ఇన్బరాజ్ (మైమ్ గోపీ)  లైంగిక వేధింపులకు పాల్పడే ఘటనలను కథగా తీసుకున్నారు. ఈ క్రమంలో, రాఘవన్ (సెల్వరాఘవన్) మరియు అతని భార్యగా నటించిన సెల్వి (ఖుషీ రవి) పాత్రలు ఈ సమస్యల్లో చిక్కుకుంటాయి. చివరికి గ్రామంలో జరుగుతున్న అన్యాయాలకు ముగింపు పలకాలని హీరో నిర్ణయించుకుంటాడు. అందుకోసం రాఘవన్ స్థానిక ఎమ్మెల్యేతో ఎలాంటి వైరం పెట్టుకున్నాడు? ఇన్బరాజ్- రాఘవన్ల మధ్య పగ ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది మిగతా కథ. 

 ఎలా ఉందంటే:

ఈ సినిమా ప్రధానంగా పవర్ మిస్యూస్, గ్రామీణ సమస్యలు, మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలు వంటి సెన్సిటివ్ అంశాలను చర్చించింది. కథ బలంగా ఉన్నప్పటికీ, కొన్ని సన్నివేశాలు సాగదీసిన ఫీలింగ్ ఇస్తుంది. ముఖ్యంగా విలేజ్ లో ప్రజలు బాధపడే సన్నివేశాలు కొంచెం హెవీగా ఉండటం వల్ల ప్రతి ఒక్కరికీ కనెక్ట్ కావడం కాస్త కష్టం కావచ్చు.

అయితే, సెల్వరాఘవన్ నటన సినిమాకు పెద్ద ప్లస్. ఖుషీ రవి కూడా తన పాత్రలో బాగా న్యాయం చేసింది. విలన్‌గా మైమ్ గోపీ పెర్ఫార్మెన్స్ సినిమాకు బలాన్ని ఇచ్చింది. మణిదన్ దైవమంగళం ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదు. ఇది ఒక రియలిస్టిక్, హార్డ్-హిట్టింగ్ డ్రామా. స్లో నేరేషన్, పవర్ ఫుల్ స్టోరీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.