మూసీ బీభత్సం... వరద బాధితులకు డ్రోన్లతో ఆహారం

మూసీ బీభత్సం... వరద బాధితులకు డ్రోన్లతో ఆహారం

మూసీ ఉగ్ర రూపానికి హైదరాబాద్ అతలాకుతలమవుతోంది. వరదల్లో చిక్కుకున్న వారికి డ్రోన్ల సహాయంతో ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్నారు మలక్ పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాల, అధికారులు. ఇదే విధంగా వాటర్ బాటిళ్లను కూడా పంపుతున్నారు. ప్రధానంగా మూసారంబాగ్, అం బేద్కర్ నగర్, మూసానగర్ బస్తీల వాసులకు డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాలను అందజేస్తున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

వికారాబాద్ జిల్లాలో భారీగా కురిసిన వర్షానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు పెద్ద ఎ్తుతన వరద రావడంతో నీటిని దిగువకు రిలీజ్ చేశారు. 15 గేట్లను తొమ్మిది అడుగుల మేరకు ఎత్తి నీటిని విడుదల చేశారు. అటు హిమాయత్ సాగర్ నుంచి 11 గేట్లను 8 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని రిలీజ్ చేశారు. దీంతో రెండు జలాశయాల నుంచి 35 వేల క్యూసెక్కుల వరద నీరు మూసీలోకి వెళ్తుంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాలు నీట మునిగిపోతున్నాయి . పలు రోడ్లు, బ్రిడ్జీలను మూసివేశారు అధికారులు .