V6 News

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి : ఎమ్మెల్యే రామచంద్రునాయక్

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి : ఎమ్మెల్యే రామచంద్రునాయక్

భద్రాద్రికొత్తగూడెం/ మహబూబాబాద్/ టేకులపల్లి/ జనగామ అర్బన్/ గూడూరు, వెలుగు : రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు సూచించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో​ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం అరైవ్​ అలైవ్​ప్రోగ్రామ్ ను నిర్వహించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రంలో కలెక్టర్​ అంకిత్, ఎస్పీ బి.రోహిత్​రాజు ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేసి, అగ్నిమాపక వారోత్సవాల వాల్​పోస్టర్లను ఆవిష్కరించారు.

మహబూబాబాద్​ పట్టణంలో ప్రభుత్వ విప్, డోర్నకల్​ ఎమ్మెల్యే రామచంద్రునాయక్, కలెక్టర్​ స్నేహశబరీశ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్​రావు రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సంబంధించిన వాల్​పోస్టర్​ను రిలీజ్​ చేశారు. టేకులపల్లిలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జనగామ పట్టణంలో కలెక్టర్​ సందీప్​కుమార్​ ఝా, డీసీపీ రాజమహేంద్రనాయక్​, డీటీవో శ్రీనివాస్​వాహనదారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. గూడూరులో మహబూబాబాద్​ ఎస్పీ శబరీశ్​వాహనదారులకు అవగాహన కల్పించారు.