నటరాజన్ బౌలింగ్‌పై ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ వార్నర్
మెల్‌బోర్న్: నెట్‌బౌలర్‌గా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టి.నటరాజన్.. వన్డే, టీ20ల్లో ఇండియా తరఫున డెబ్యూ చేశాడు. ఉమేశ్ యాదవ్ గాయపడటంతో టెస్ట్ జట్టు నుంచి కూడా పిలుపు అందుకున్నాడు. అయితే, వైట్‌బాల్ క్రికెట్‌లో సూపర్ హిట్ అయిన నటరాజన్ టెస్టుల్లో ఏ మేరకు రాణిస్తాడో చెప్పలేమని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ కెప్టెన్ అయిన వార్నర్, తన టీమ్‌మేట్ నటరాజన్ పెర్ఫామెన్స్‌ను చాలా దగ్గర నుంచి చూశాడు. టీ20ల్లో సక్సెస్‌ను నటరాజన్ టెస్టుల్లో కంటిన్యూ చేస్తాడా అని వార్నర్‌ను ప్రశ్నించగా సందేహం వ్యక్తం చేశాడు. ‘ రంజీ క్రికెట్‌లో నటరాజన్ స్టాట్స్ ఏమిటో, ఎలా బౌలింగ్ చేశాడో నాకు పెద్దగా తెలియదు. కానీ తన లైన్ అండ్ లెంగ్త్ ఎలా ఉంటాయో బాగా తెలుసు. టెస్టు మ్యాచ్‌ల్లో అది కొనసాగిస్తాడా అంటే కచ్చితంగా చెప్పలేను కానీ మహ్మద్ సిరాజ్ గురించి కాస్త ఎక్కువ తెలుసు. ఫస్ట్ మ్యాచ్‌లో సిరాజ్‌కు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారో.. నట్టూకు అలానే అండగా ఉంటే కచ్చితంగా సక్సెస్ అవుతాడు. ఏదేమైనా టెస్టు జట్టుకు సెలెక్ట్ అవ్వడం నట్టూకు దక్కిన గొప్ప బహుమతి. తండ్రి అవ్వబోతున్నానని తెలిసి కూడా నటరాజన్ నెట్ బౌలర్‌గా ఆసీస్ వచ్చాడు. ఆ తర్వాత నేషనల్ జట్టులోకి వచ్చాడు. ఆ విషయంలో తనకి కంగ్రాట్స్. నటరాజన్ ఎంత గొప్ప బౌలరో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా నాకు బాగా తెలుసు’ అని వార్నర్ చెప్పాడు.

