ఒక పథకం ప్రకారం మూవీ టీజర్ రిలీజ్

ఒక పథకం ప్రకారం మూవీ టీజర్ రిలీజ్

హీరో సాయిరామ్ శంకర్..అదేనండి..డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సోదరుడు. చాలా రోజుల తర్వాత వెండితెరపై ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నాడు. 143 మూవీతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన సాయిరామ్..బంపర్ ఆఫర్తో హిట్ కొట్టాడు. ఆ తర్వాత అతని సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో.. అవకాశాలు దక్కలేదు. అయితే కొంత గ్యాప్ తర్వాత ఒక పథకం ప్రకారం మూవీతో వస్తున్నాడు సాయిరామ్ శంకర్.ఈ మూవీలో సాయి..రామ రావణ తరహా పాత్రలో  కనిపించబోతున్నాడు. అయితే తాజాగా ఈ చిత్రం టీజర్ రిలీజైంది. మాస్ మహారాజ రవితేజ టీజర్ను రిలీజ్ చేశాడు. 

సినిమాలో సమ్ థింగ్..
ఒక పథకం ప్రకారం టీజర్లో ఒక్క డైలాగ్ కూడా లేదు. టీజర్లో వచ్చే మ్యూజిక్..మూవీపై సస్పెన్స్ని క్రియేట్ చేసిందని చెప్పాలి. టీజర్ మొదట్లో ధూమపానం చేస్తూ కనిపించే సాయిరామ్..చివర్లో ఆందోళనతో ఆలోచిస్తుంటాడు. మొత్తంగా ఒక పథకం ప్రకారం టీజర్ సినిమాపై ఆసక్తి కలిగించే విధంగా ఉంది. 

వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాను జాతీయ అవార్డు విన్నింగ్ దర్శకుడు వినోద్ విజయన్ తెరకెక్కిస్తున్నారు. సాయిరామ్కు జోడిగా అశీమా నర్వాల్  నటిస్తోంది. ఈ సినిమా జూన్ 24న విడుదల కానుంది. మరి హిట్ కోసం వెయిట్ చేస్తున్న సాయిరామ్ శంకర్కు ఒక పథకం ప్రకారం విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.