ఓలా, ఉబర్ డ్రైవర్ల దేశవ్యాప్త సమ్మె: నిలిచిపోయిన క్యాబ్ సేవలు!

ఓలా, ఉబర్ డ్రైవర్ల దేశవ్యాప్త సమ్మె: నిలిచిపోయిన క్యాబ్ సేవలు!

ఓలా, ఉబర్, రాపిడో  క్యాబ్ డ్రైవర్లు ఈరోజు (ఫిబ్రవరి 7) దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టారు. మా సమస్యలను పరిష్కరించడం లేదని నిరసిస్తూ 'ఆల్ ఇండియా బ్రేక్‌డౌన్' పేరుతో ఈ ఆందోళన నిర్వహిస్తున్నారు. దింతో దేశంలోని చాలా నగరాల్లో క్యాబ్ సేవలు నిలిచిపోగా.. సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సమ్మెకు  కారణాలు
తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) ఈ సమ్మెకి పిలుపివ్వగా... సమ్మెకు కారణాలను వెల్లడించింది. డ్రైవర్లకు వచ్చే ఆదాయం చాలా తగ్గిపోయిందని, వారు పేదరికంలోకి వెళ్తున్నారని యూనియన్ ఆవేదన వ్యక్తం చేసింది. క్యాబ్ కంపెనీలు భారీగా లాభపడుతున్నా, డ్రైవర్లకు మాత్రం సరైన వాటా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఈ కంపెనీలపై సరైన నిబంధనలు విధించకపోవడం వల్ల డ్రైవర్లు నష్టపోతున్నారు.

ఈ సమస్యలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి డ్రైవర్ల సంఘం ఒక లేఖ రాసింది. అందులో కనీస ఛార్జీలు అంటే ఆటోలు, క్యాబ్‌లు, బైక్ టాక్సీలకు ప్రభుత్వం వెంటనే కనీస ఛార్జీని నిర్ణయించాలి. డ్రైవర్ల సంఘాలతో మాట్లాడిన తర్వాతే కొత్త నిబంధనలు తీసుకురావాలి. ప్రైవేట్ వాహనాలపై నిషేధం విధిస్తు వైట్ బోర్డ్ (ప్రైవేట్) వాహనాలను ట్యాక్సీలుగా వాడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

"కంపెనీలు వారి ఇష్టానుసారం ఛార్జీలు మారుస్తూ డ్రైవర్లను వేధిస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు భద్రత కల్పించాలి అని యూనియన్ అధ్యక్షుడు  అన్నారు.