రూ.295 కోట్ల విలువచేసే డ్రగ్స్ ధ్వంసం

రూ.295 కోట్ల విలువచేసే డ్రగ్స్ ధ్వంసం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌లో కస్టమ్స్, డైరెక్టరేట్‌‌‌‌ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌‌‌‌ (డీఆర్‌‌‌‌‌‌‌‌ఐ) స్వాధీనం చేసుకున్న రూ.295 కోట్లు విలువ చేసే 8,946 కిలోల నార్కొటిక్ డ్రగ్‌‌‌‌ను సోమవారం అధికారులు ధ్వంసం చేశారు. ‘ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్‌‌‌‌ డే’ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘సే నో టు డ్రగ్స్‌‌‌‌’ క్యాంపెయిన్‌‌‌‌లో భాగంగా కస్టమ్స్‌‌‌‌, డీఆర్‌‌‌‌‌‌‌‌ఐ అధికారులు నార్కొటిక్స్‌‌‌‌ డిస్ట్రాయ్‌‌‌‌ కార్యక్రమం చేపట్టారు. మేడ్చల్‌‌‌‌ జిల్లా దుండిగల్‌‌‌‌లోని హైదరాబాద్ వేస్ట్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌లో ఉన్నతాధికారుల పర్యవేక్షణలో గంజాయి, డ్రగ్స్‌‌‌‌ మెటీరియల్‌‌‌‌ను డిస్ట్రాయ్‌‌‌‌ చేశారు. 

ALSOREAD:210 కిలోల గంజాయి సీజ్

వాటికి సంబంధించిన వివరాలను కస్టమ్స్‌‌‌‌ అధికారులు ప్రెస్‌‌‌‌నోట్‌‌‌‌లో వెల్లడించారు. శంషాబాద్‌‌‌‌ ఎయిర్ పోర్ట్‌‌‌‌తో పాటు శివారు ప్రాంతాల్లోని ఇండస్ట్రీస్‌‌‌‌లో తయారు చేస్తున్న నిషేధిత డ్రగ్ మెటీరియల్‌‌‌‌ సీజ్‌‌‌‌ చేసినట్లు వెల్లడించారు. గతేడాది ఏప్రిల్‌‌‌‌, మే నెలల్లో మల్వాయి, టాంజానియా, అంగోల నుంచి హైదరాబాద్‌‌‌‌ వచ్చిన ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌ ప్యాసింజర్స్‌‌‌‌ వద్ద రూ.77 కోట్లు విలువ చేసే 11 కిలోల హెరాయిన్‌‌‌‌ డీఆర్‌‌‌‌‌‌‌‌ఐ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వాటన్నింటినీ డిస్ట్రాయ్ చేసినట్లు తెలిపారు.