ఏపీలో భారీగా పెరిగిన కేసులు.. ఒకే రోజులో 134 మందికి వైరస్

ఏపీలో భారీగా పెరిగిన కేసులు.. ఒకే రోజులో 134 మందికి వైరస్

అమరావతి: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన ఒక్క రోజులో కొత్తగా 134 వైరస్ పాజిటివ్ కేసులు ఫైల్ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 3,117 కు చేరుకుంది. వైరస్ కు ట్రీట్​మెంట్ పొందుతూ ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 58 కు చేరిందని ప్రభుత్వం హెల్త్ బులిటెన్​లో బుధవారం వెల్లడించింది. తాజా కేసుల్లో తొమ్మిది చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌తో లింక్​అయినవేనని బులెటిన్ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 9,664 శాంపిల్ టెస్టులు జరిగాయని, ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో సహా 48 మంది చికిత్స తర్వాత వివిధ ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1913 రికవరీ అయినట్లు పేర్కొంది. మరో 816 మంది ట్రీట్​మెంట్ పొందుతున్నారు.